సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు స్థానిక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2024లో దేశంలో మార్షల్ లా (సైనిక పాలన) విధించడం ద్వారా తిరుగుబాటుకు పాల్పడ్డారని పేర్కొంటూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది.
రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు, జాతీయ అసెంబ్లీని దీర్ఘకాలం స్తంభింపజేయాలనే ఉద్దేశంతోనే మార్షల్ లా ఆదేశాలు జారీ చేశారని కోర్టు పేర్కొంది. ఈ సంక్షోభంలో కీలక పాత్ర పోషించిన మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్‌హ్యూన్‌కు కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కాగా, 2024 డిసెంబర్‌లో యాన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆరు గంటల్లోనే ఎంపీలందరూ కలిసి అత్యవసర ఓటింగ్ ద్వారా మార్షల్ లాను ఎత్తివేశారు.
